జి.చెర్లోపల్లి గ్రామంలో దొంగతనాల నివారణతో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉదయగిరి ఎస్ఐ బి.మహేంద్ర ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి గొడవలు, కొట్లాటలకు పాల్పడవద్దని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. గ్రామంలో శాంతియుత వాతావరణం కొనసాగేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్ఐ మహేంద్ర సూచించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన కోరారు.

జి.చెర్లోపల్లి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ బి.మహేంద్ర