Saturday, 15 August 2026
  • Home  
  • జెడ్పీ బాలికల పాఠశాలలో ముక్కా వరలక్ష్మి ఆకస్మిక తనిఖీ
- తిరుపతి

జెడ్పీ బాలికల పాఠశాలలో ముక్కా వరలక్ష్మి ఆకస్మిక తనిఖీ

రైల్వేకోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి రైల్వేకోడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థినులకు అందుతున్న వసతులను పరిశీలించారు. తాగునీరు, మరుగుదొడ్లు, తరగతి గదులు, విద్యుత్, ఫర్నిచర్, పరిశుభ్రత తదితర అంశాలపై విద్యార్థినులు, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని, విద్యార్థినులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు సంబంధిత అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్తామని ముక్కా వరలక్ష్మి తెలిపారు. పాఠశాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.