పున్నమి ప్రతినిధి మాచర్ల ఆగస్టు 14: పట్టణంలో శుక్రవారం నిర్వహించిన హర్ ఘర్ తిరంగా భారీ ర్యాలీలో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులు, విద్యాసంస్థల ప్రతినిధులు, యువత, స్వచ్ఛంద సేవా సంస్థలు, అధికారులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
స్థానిక రింగ్ రోడ్డు సెంటర్ నుంచి మాచర్ల బస్టాండ్ వరకు భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. జై భారత్, భారత్ మాతాకీ జై, వందేమాతరం నినాదాలతో పట్టణ వీధులు మార్మోగాయి. అనంతరం పార్క్ సెంటర్‌లోని జాతీయ పిత మహాత్మా గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.
బస్టాండ్ సెంటర్‌లో భారీ మానవహారంగా ఏర్పడి జాతీయ సమైక్యత, దేశభక్తి, దేశాభివృద్ధికి కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ దేశభక్తి భావనతో ముందుకు సాగాలని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వేణుబాబు, ఎమ్మెల్యే జూలకంటి తనయుడు గౌతమ్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్, పట్టణ అధ్యక్షులు కొమెరా దుర్గారావు, పల్నాడు జిల్లా పార్లమెంటు సెక్రటరీ షేక్ జానీ భాష, టీడీపీ సీనియర్ నాయకులు ఎనుముల కేశవరెడ్డి, వజ్రం నాయక్, పోలూరి నరసింహారావు, కంభంపాటి అనిల్‌కుమార్, సూరె యలమందతో పాటు పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

హర్ ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్న మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి జాతీయ జెండాతో భారీ ర్యాలీ.. మానవహారంగా విద్యార్థులు, యువత
పున్నమి ప్రతినిధి మాచర్ల ఆగస్టు 14: పట్టణంలో శుక్రవారం నిర్వహించిన హర్ ఘర్ తిరంగా భారీ ర్యాలీలో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులు, విద్యాసంస్థల ప్రతినిధులు, యువత, స్వచ్ఛంద సేవా సంస్థలు, అధికారులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక రింగ్ రోడ్డు సెంటర్ నుంచి మాచర్ల బస్టాండ్ వరకు భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. జై భారత్, భారత్ మాతాకీ జై, వందేమాతరం నినాదాలతో పట్టణ వీధులు మార్మోగాయి. అనంతరం పార్క్ సెంటర్‌లోని జాతీయ పిత మహాత్మా గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. బస్టాండ్ సెంటర్‌లో భారీ మానవహారంగా ఏర్పడి జాతీయ సమైక్యత, దేశభక్తి, దేశాభివృద్ధికి కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ దేశభక్తి భావనతో ముందుకు సాగాలని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వేణుబాబు, ఎమ్మెల్యే జూలకంటి తనయుడు గౌతమ్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్, పట్టణ అధ్యక్షులు కొమెరా దుర్గారావు, పల్నాడు జిల్లా పార్లమెంటు సెక్రటరీ షేక్ జానీ భాష, టీడీపీ సీనియర్ నాయకులు ఎనుముల కేశవరెడ్డి, వజ్రం నాయక్, పోలూరి నరసింహారావు, కంభంపాటి అనిల్‌కుమార్, సూరె యలమందతో పాటు పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

