Friday, 14 August 2026
  • Home  
  • చిట్వేల్ జెడ్పీ హైస్కూల్‌లో మొక్కలు నాటిన పోలీసులు
- తిరుపతి

చిట్వేల్ జెడ్పీ హైస్కూల్‌లో మొక్కలు నాటిన పోలీసులు

పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులు, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చిట్వేల్‌ జెడ్పీ హైస్కూల్‌ ఆవరణలో పోలీసుల ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్‌. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు పర్యవేక్షణలో కోడూరు రూరల్‌ సీఐ డి. శ్రీనివాసులు, చిట్వేల్‌ ఎస్‌ఐ వినోద్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రరాజు, ఉపాధ్యాయులు సౌఫియా, కలావతి, సుభాషిణి, ఎన్‌సీసీ క్యాడెట్లు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొని పాఠశాల ఆవరణలో వివిధ రకాల మొక్కలు నాటారు. ఏఎస్ఐ యంగయ్య, హెడ్‌కానిస్టేబుల్‌ నరసింహులు, కానిస్టేబుళ్లు నరేంద్ర, సుధాకర్‌నాయుడు తదితరులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వ శాఖలకే పరిమితం కాదని, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని తెలిపారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు బాధ్యత తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రతి విద్యార్థి ‘నా మొక్క.. నా బాధ్యత’ అనే భావనతో ముందుకు సాగాలని, ఇళ్లలో, పాఠశాలల్లో మొక్కలు నాటి వాటిని కాపాడాలని పిలుపునిచ్చారు. పచ్చదనం పెంపొందించడం ద్వారా భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని పేర్కొన్నారు.

పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులు, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చిట్వేల్‌ జెడ్పీ హైస్కూల్‌ ఆవరణలో పోలీసుల ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్‌. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు పర్యవేక్షణలో కోడూరు రూరల్‌ సీఐ డి. శ్రీనివాసులు, చిట్వేల్‌ ఎస్‌ఐ వినోద్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రరాజు, ఉపాధ్యాయులు సౌఫియా, కలావతి, సుభాషిణి, ఎన్‌సీసీ క్యాడెట్లు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొని పాఠశాల ఆవరణలో వివిధ రకాల మొక్కలు నాటారు. ఏఎస్ఐ యంగయ్య, హెడ్‌కానిస్టేబుల్‌ నరసింహులు, కానిస్టేబుళ్లు నరేంద్ర, సుధాకర్‌నాయుడు తదితరులు మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వ శాఖలకే పరిమితం కాదని, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని తెలిపారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు బాధ్యత తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రతి విద్యార్థి ‘నా మొక్క.. నా బాధ్యత’ అనే భావనతో ముందుకు సాగాలని, ఇళ్లలో, పాఠశాలల్లో మొక్కలు నాటి వాటిని కాపాడాలని పిలుపునిచ్చారు. పచ్చదనం పెంపొందించడం ద్వారా భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.