Friday, 14 August 2026
  • Home  
  • ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలి
- నంద్యాల

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలి

నంద్యాల, ఆగస్టు 13: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌ ఆదేశించారు. గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో సమావేశంలో సవరణ ప్రక్రియను సమీక్షించారు. నంద్యాల నుంచి జిల్లా కలెక్టర్‌ రాజకుమారి గణియా పాల్గొన్నారు. ఓటర్ల క్లెయిమ్‌లు, అభ్యంతరాలను త్వరితగతిన పరిష్కరించాలని సీఈవో సూచించారు. ఆగస్టు 22, 23, 29, 30 తేదీల్లో పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహించాలని తెలిపారు. 18–19 ఏళ్ల యువత ఓటర్లుగా నమోదు అయ్యేలా విద్యాసంస్థల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.జిల్లాలో సవరణ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తూ పెండింగ్‌ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరిస్తున్నట్లు కలెక్టర్‌ రాజకుమారి గణియా తెలిపారు.

నంద్యాల, ఆగస్టు 13: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌ ఆదేశించారు. గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో సమావేశంలో సవరణ ప్రక్రియను సమీక్షించారు. నంద్యాల నుంచి జిల్లా కలెక్టర్‌ రాజకుమారి గణియా పాల్గొన్నారు.
ఓటర్ల క్లెయిమ్‌లు, అభ్యంతరాలను త్వరితగతిన పరిష్కరించాలని సీఈవో సూచించారు. ఆగస్టు 22, 23, 29, 30 తేదీల్లో పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహించాలని తెలిపారు. 18–19 ఏళ్ల యువత ఓటర్లుగా నమోదు అయ్యేలా విద్యాసంస్థల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.జిల్లాలో సవరణ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తూ పెండింగ్‌ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరిస్తున్నట్లు కలెక్టర్‌ రాజకుమారి గణియా తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.