Saturday, 15 August 2026
  • Home  
  • కొవ్వూరు నియోజకవర్గ స్థాయి జే. యం.ఎల్.బి.సి సమావేశానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న యం.ఎల్.ఏ.
- తూర్పు గోదావరి

కొవ్వూరు నియోజకవర్గ స్థాయి జే. యం.ఎల్.బి.సి సమావేశానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న యం.ఎల్.ఏ.

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గ స్థాయి జాయింట్ మండల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2026–27 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు, వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా సమర్థవంతంగా అమలు చేయడం వంటి అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. నియోజకవర్గంలోని కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి మండలాల్లోని అర్హులైన నిరుద్యోగులు, స్వయం ఉపాధి పొందాలనుకునే యువత, మహిళలు, చిన్న వ్యాపారులు, రైతులు మరియు వివిధ వర్గాల లబ్ధిదారులకు రుణ సదుపాయాలు సులభంగా అందేలా బ్యాంకర్లు సహకరించాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రభుత్వ పథకాల ద్వారా అందుతున్న రుణాలను అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి చేరేలా అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్, కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి మండలాల ఎంపీడీఓలు సి.హెచ్. వెంకటరెడ్డి,ఆర్. శ్రీదేవి, వేణుగోపాలరెడ్డి, మూడు మండలాలకు చెందిన వివిధ బ్యాంకుల బ్రాంచ్ మేనేజర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గ స్థాయి జాయింట్ మండల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
2026–27 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు, వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా సమర్థవంతంగా అమలు చేయడం వంటి అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు.
నియోజకవర్గంలోని కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి మండలాల్లోని అర్హులైన నిరుద్యోగులు, స్వయం ఉపాధి పొందాలనుకునే యువత, మహిళలు, చిన్న వ్యాపారులు, రైతులు మరియు వివిధ వర్గాల లబ్ధిదారులకు రుణ సదుపాయాలు సులభంగా అందేలా బ్యాంకర్లు సహకరించాలని ఎమ్మెల్యే సూచించారు.
ప్రభుత్వ పథకాల ద్వారా అందుతున్న రుణాలను అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి చేరేలా అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు.
ఈ సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్, కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి మండలాల ఎంపీడీఓలు సి.హెచ్. వెంకటరెడ్డి,ఆర్. శ్రీదేవి, వేణుగోపాలరెడ్డి, మూడు మండలాలకు చెందిన వివిధ బ్యాంకుల బ్రాంచ్ మేనేజర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.