*ప్రపంచ ఆర్గాన్ డొనేషన్ దినోత్సవం సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ
కాకినాడ*
ప్రపంచ ఆర్గాన్ డొనేషన్ దినోత్సవం సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడ ఆధ్వర్యంలో గురువారం అవగాహన ర్యాలీ మరియు ఫ్లాష్ మాబ్ నిర్వహించారు.
ఎస్పీ కార్యాలయం నుంచి భానుగుడి జంక్షన్ వరకు నిర్వహించిన ఈ అవగాహన ర్యాలీని కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్, IPS గారు మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. కె. అనిత గారు జెండా ఊపి ప్రారంభించారు.
కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ గారు మాట్లాడుతూ:
అవయవ దానం ద్వారా మరొకరికి పునర్జన్మను ప్రసాదించే గొప్ప అవకాశం లభిస్తుందని అన్నారు. సమాజంలో ఆర్గాన్ డొనేషన్‌పై మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని, యువత ఈ సందేశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి కుడా చైర్మన్ శ్రీ సత్య తలాటం గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.అవయవ దానం ఒక మహోన్నతమైన సేవ అని, మనం మరణానంతరం కూడా మరొకరి జీవితాన్ని కాపాడే అవకాశం అవయవ దానం ద్వారా లభిస్తుందని అన్నారు. ప్రజలు ఆర్గాన్ డొనేషన్‌పై ఉన్న అపోహలను తొలగించుకొని, అవయవ దానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. యువతలో అవయవ దానంపై మరింత అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని, మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడ చేపట్టిన అవగాహన ర్యాలీ, ఫ్లాష్ మాబ్ కార్యక్రమాలు ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.
ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ యూరాలజిస్ట్ డా. కల్యాణ్ బాబు, నెఫ్రాలజిస్ట్ డా. రాజా అమరేంద్ర, అనస్థీషియా విభాగం డా. కిషోర్ బాబు మాట్లాడుతూ, ఆర్గాన్ డొనేషన్ ప్రాముఖ్యత, అవయవ దానం ద్వారా మరొకరికి ప్రాణదానం చేసే అవకాశం, ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం గురించి వివరించారు.
మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడ సెంటర్ హెడ్ శ్రీ నందికోళ్ల ఆంజనేయస్వామి (అంజిబాబు) మాట్లాడుతూ, అవయవ దానం పట్ల ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, ఆర్గాన్ డొనేషన్‌పై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక వ్యక్తి అవయవ దానం ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపవచ్చని తెలిపారు.
ర్యాలీతో పాటు నిర్వహించిన ఫ్లాష్ మాబ్ ద్వారా విద్యార్థులు మరియు ప్రజలకు ఆర్గాన్ డొనేషన్‌పై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్స్ సిబ్బంది, ఆదిత్య కళాశాల విద్యార్థులు, ఆదర్శ కళాశాల విద్యార్థులు, ఇతర కళాశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
“అవయవ దానం – మరొకరికి పునర్జన్మ” అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రజల్లో ఆర్గాన్ డొనేషన్‌పై అవగాహన పెంపొందించడంలో ముఖ్యపాత్ర పోషించింది.
Uploaded Video:











