ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కృషి ఫలితం*
*కేవీబీ పురం: సత్యవేడు నియోజకవర్గంలోని కేవీబీ పురం మండలంలో సత్యవేడు శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం పర్యటించారు. ఈ సందర్భంగా మండల ప్రజలు, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చుతూ, పూలమాలలతో ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు.*
గత నవంబర్‌లో కేవీబీ పురం మండల కేంద్రంలోని రాయల చెరువు అకస్మాత్తుగా తెగిపోవడంతో కళత్తూరు, పాతపాలెం, ఓళ్లూరు గ్రామాలకు చెందిన రైతుల పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం అందించాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం పెద్దల దృష్టికి తీసుకెళ్లి, బాధితులకు న్యాయం జరిగేలా నిరంతరం కృషి చేశారు.
*ఎమ్మెల్యే కృషి ఫలితంగా రాయల చెరువు బాధిత రైతులకు కూటమి ప్రభుత్వం తరఫున రూ.1,09,13,000 ఆర్థిక సహాయం మంజూరైంది. కేవీబీ పురంలో నిర్వహించిన కార్యక్రమంలో బాధిత రైతులకు నష్టపరిహార చెక్కులను అందజేశారు.*
*ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదన్నారు. “ప్రజలే దేవుళ్లు.. సమాజమే దేవాలయం” అనే విషయాన్ని గుర్తుంచుకుని ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.*
సత్యవేడు నియోజకవర్గంలోని ఏడు మండలాల ప్రజలకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సమస్యలు ఎదురైతే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు. అవసరమైన సమస్యలను ఎంఆర్‌ఓ, ఎంపీడీఓ, పోలీసు అధికారులు దృష్టికి తీసుకెళ్లినప్పుడు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం అనవసరంగా కేసుల వరకు వెళ్లడం వల్ల ప్రయోజనం ఉండదని సూచించారు.
రైతుల కష్టాలను గుర్తించి అసెంబ్లీ వేదికగా తమ సమస్యను ప్రస్తావించి, ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందేలా కృషి చేసిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గారికి రాయల చెరువు బాధిత రైతులు కృతజ్ఞతలు తెలిపారు
ఈ కార్యక్రమంలో కేవీబీ పురం మండల ప్రజలు, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు, రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.


