Wednesday, 12 August 2026
  • Home  
  • ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలి… జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్*
- ఖమ్మం

ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలి… జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్*

*ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలి… జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్* *వెలుగుమట్ల లబ్ధిదారులకు సకాలంలో ఆర్థిక సహాయం.. వేగంగా సాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు* *నిర్ధిష్ట గడువులోగా పనులు జరిగేలా అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలి* *వెలుగుమట్లలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఆగస్టు 12 ఖమ్మం: ప్రభుత్వం పేద కుటుంబాలకు గౌరవప్రదమైన జీవనాన్ని అందించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని తమ సొంతింటి కలను సాకారం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. బుధవారం ఖమ్మం నగర పరిధిలోని వెలుగుమట్ల ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో సందర్శించి నిర్మాణ పనులను తనిఖీ చేశారు. ఇంటి నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, అవసరాలు, నిర్మాణ దశల వివరాలను తెలుసుకున్నారు. నిర్మాణ పనుల్లో ఎదురవుతున్న ఇబ్బందులపై ఆరా తీసి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య లతో కలిసి ఇండ్లు ఇండ్లు క్షేత్రస్థాయిలో తిరుగుతూ నిర్మాణ దశలో ఉన్న ఇళ్లను ఒక్కొక్కటిగా పునాదుల నిర్మాణం, గోడల నిర్మాణం, స్లాబ్ పనులు, పైకప్పు పనులు, తుదిదశ పనుల పురోగతిని పరిశీలించారు. ప్రతి ఇంటి నిర్మాణం నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా అధికారులు పర్యవేక్షించాలని, లబ్ధిదారులకు అవసరమైన సాంకేతిక సూచనలు అందిస్తూ నిర్మాణాలు వేగంగా పూర్తయ్యేలా సహకరించాలని హౌసింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ తనిఖీ సందర్భంగా హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, ఖమ్మం ఆర్డీవో శ్రీనివాస్, ఖమ్మం అర్బన్ తహసీల్దారు జయచంద్ర, ఈఈ జగ్గారావు, హౌసింగ్ ఏఈలు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

*ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలి… జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్*

*వెలుగుమట్ల లబ్ధిదారులకు సకాలంలో ఆర్థిక సహాయం.. వేగంగా సాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు*

*నిర్ధిష్ట గడువులోగా పనులు జరిగేలా అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలి*

*వెలుగుమట్లలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్

పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఆగస్టు 12

ఖమ్మం:
ప్రభుత్వం పేద కుటుంబాలకు గౌరవప్రదమైన జీవనాన్ని అందించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని తమ సొంతింటి కలను సాకారం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు.

బుధవారం ఖమ్మం నగర పరిధిలోని వెలుగుమట్ల ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో సందర్శించి నిర్మాణ పనులను తనిఖీ చేశారు. ఇంటి నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, అవసరాలు, నిర్మాణ దశల వివరాలను తెలుసుకున్నారు. నిర్మాణ పనుల్లో ఎదురవుతున్న ఇబ్బందులపై ఆరా తీసి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య లతో కలిసి ఇండ్లు ఇండ్లు క్షేత్రస్థాయిలో తిరుగుతూ నిర్మాణ దశలో ఉన్న ఇళ్లను ఒక్కొక్కటిగా పునాదుల నిర్మాణం, గోడల నిర్మాణం, స్లాబ్ పనులు, పైకప్పు పనులు, తుదిదశ పనుల పురోగతిని పరిశీలించారు. ప్రతి ఇంటి నిర్మాణం నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా అధికారులు పర్యవేక్షించాలని, లబ్ధిదారులకు అవసరమైన సాంకేతిక సూచనలు అందిస్తూ నిర్మాణాలు వేగంగా పూర్తయ్యేలా సహకరించాలని హౌసింగ్ శాఖ అధికారులను ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ తనిఖీ సందర్భంగా హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, ఖమ్మం ఆర్డీవో శ్రీనివాస్, ఖమ్మం అర్బన్ తహసీల్దారు జయచంద్ర, ఈఈ జగ్గారావు, హౌసింగ్ ఏఈలు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.