Wednesday, 12 August 2026
  • Home  
  • చెరువులో చేపల వేలం ఆపాలి-ఎంపీడీఓకు ఆయకట్టు రైతుల వినతి
- తిరుపతి

చెరువులో చేపల వేలం ఆపాలి-ఎంపీడీఓకు ఆయకట్టు రైతుల వినతి

తొట్టంబేడు, ఆగస్టు 11, (పున్నమి న్యూస్): తొట్టంబేడు మండలంలోని లింగమ నాయుడుపల్లి చెరువు ఆయకట్టు రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం (11-08-2026)నాడు రైతులంతా కలిసి తొట్టంబేడు మండల పరిషత్ అభివృద్ధి అధికారికి (ఎంపీడీఓ) ఒక సమగ్ర వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయకట్టు రైతులు, చెరువు టీసీ మెంబర్ జి. శంకర్ నాయుడు, వైస్ చైర్మన్ లతో కూడిన ప్రతినిధులు మాట్లాడుతూ.. చెరువు కింద సాగు చేసుకుంటున్న తమకు కొందరు వ్యక్తులు చేస్తున్న పనుల వల్ల తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని కొంతమంది చెరువులో చేపలు పెంచేందుకు వేలం వేసి, అందులో చేపల పిల్లలను వదులుతున్నారని తెలిపారు. దీనివల్ల చేపలు పట్టేందుకు వీలుగా చెరువులో 75 శాతం నీరు ఉన్నప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా నీటిని పూర్తిగా కిందకు వదిలేస్తున్నారని ఆరోపించారు. ఈ అనాలోచిత చర్యల వల్ల ఆయకట్టు రైతులు సకాలంలో పంటలు వేసుకోలేకపోతున్నారని, రాబోయే రెండో పంట పెట్టుకోవడానికి కూడా సాగునీరు అందక రైతాంగం తీవ్రంగా నష్టపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పంట పండే దశలో చివరి రెండు తడులకు నీరు అత్యవసరమైనప్పుడు చెరువులో తక్కువ నీరు ఉందనే సాకుతో నీటిని విడుదల చేయడం లేదని, దీనివల్ల పంటలు చేతికి రాకుండా ఎండిపోతున్నాయని వాపోయారు. నీటిని పూర్తిగా వదిలేసినా, లేదా తడికి నీరు ఇవ్వకపోయినా తాము నిలువునా మునిగిపోతామని ఆవేదన చెందారు. కాబట్టి ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు లింగమ నాయుడుపల్లి చెరువులో చేపలు వదలకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని, సాగునీరు సకాలంలో అందేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయకట్టు రైతులు జి. బాబు, ఎస్. కుమార్, జి. రమేష్, బి. ప్రకాష్, ఎస్. అంజయ్య, జి. రమణయ్య తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.