రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, కేవలం ప్రకటనలు, హామీలతో కాలయాపన చేయకుండా స్ప ష్టమైన ఉత్తర్వులు జారీ చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ డిమాండ్ చేశారు. అరకులోయ మండలం శరభగుడ గ్రామంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకుని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా నాయకులు కె జగన్నాథం అధ్యక్షతన జరిగిన జెండా ఆవిష్కరణలో జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ మాట్లాడుతూ ము ఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు జీఓ -3కు ప్రత్యామ్నాయ జీఓను వెంటనే జారీ చేసి, 2026 అక్టోబర్ లో నిర్వహించనున్న డీఎస్సీలో ఆదివాసీ యువతకు 100 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. రెండు సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై కాలయాపన చేస్తూ ఆదివాసీలను ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు. 100 శాతం రిజర్వేషన్ కు సంబంధించి ప్రత్యామ్నాయ జీఓను తక్షణమే జారీ చేయాలని, 1/70 చట్టం పరిరక్షణ కోసం సుప్రీంకోర్టులో ప్రభుత్వం కౌంటర్ అఫిడ విట్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసి హక్కులు, చట్టాలు ఉల్లంఘించి హైడ్రోపవర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం బడా కార్పొరేట్ అధాని, నవయుగ, శిరిడి సాయి ఎలక్ట్రికల్ కన్స్ట్రక్షన్ కంపెనీలకు అటవీ భూములు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా చేసుకున్న ఒప్పందాల జీవోలు 13,51,29,2 రద్దు చేయాలని, అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జిల్లాను జోన్-1లోనే కొనసాగిస్తూ గెజిట్ విడుదల చేయాలని కోరారు. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో అడవులను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వ వైఖరి వల్ల ఆదివాసీ హక్కులు, చట్టాలు బలహీనపడుతు న్నాయని, మరోవైపు బూటకపు హామీలతో ఆదివాసీలను మోసం చేస్తున్నారని ఆరోపిం చారు. 1/70 చట్టం పరిరక్షణ విషయంలో ప్రభుత్వం మరింత జాప్యం చేయడం సరికాదన్నారు ఆదివాసీలకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి హామీలు అమలుకు నిర్దిష్టమైన స్పష్టమైన కాలపరిమితితో సమస్యలు పరిష్కారం చేయాలని లేని పక్షంలో భవిష్యత్తులో జరిగే పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు రాము గోపాల్ అర్జున్ ప్రసాద్ మోహన్ మగ్గన్న తదితరులు పాల్గొన్నారు.

జీఓ -3 పై రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం కాదు ఉత్తర్వులు జారి చేయాలి – ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్
రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, కేవలం ప్రకటనలు, హామీలతో కాలయాపన చేయకుండా స్ప ష్టమైన ఉత్తర్వులు జారీ చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ డిమాండ్ చేశారు. అరకులోయ మండలం శరభగుడ గ్రామంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకుని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా నాయకులు కె జగన్నాథం అధ్యక్షతన జరిగిన జెండా ఆవిష్కరణలో జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ మాట్లాడుతూ ము ఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు జీఓ -3కు ప్రత్యామ్నాయ జీఓను వెంటనే జారీ చేసి, 2026 అక్టోబర్ లో నిర్వహించనున్న డీఎస్సీలో ఆదివాసీ యువతకు 100 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. రెండు సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై కాలయాపన చేస్తూ ఆదివాసీలను ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు. 100 శాతం రిజర్వేషన్ కు సంబంధించి ప్రత్యామ్నాయ జీఓను తక్షణమే జారీ చేయాలని, 1/70 చట్టం పరిరక్షణ కోసం సుప్రీంకోర్టులో ప్రభుత్వం కౌంటర్ అఫిడ విట్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసి హక్కులు, చట్టాలు ఉల్లంఘించి హైడ్రోపవర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం బడా కార్పొరేట్ అధాని, నవయుగ, శిరిడి సాయి ఎలక్ట్రికల్ కన్స్ట్రక్షన్ కంపెనీలకు అటవీ భూములు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా చేసుకున్న ఒప్పందాల జీవోలు 13,51,29,2 రద్దు చేయాలని, అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జిల్లాను జోన్-1లోనే కొనసాగిస్తూ గెజిట్ విడుదల చేయాలని కోరారు. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో అడవులను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వ వైఖరి వల్ల ఆదివాసీ హక్కులు, చట్టాలు బలహీనపడుతు న్నాయని, మరోవైపు బూటకపు హామీలతో ఆదివాసీలను మోసం చేస్తున్నారని ఆరోపిం చారు. 1/70 చట్టం పరిరక్షణ విషయంలో ప్రభుత్వం మరింత జాప్యం చేయడం సరికాదన్నారు ఆదివాసీలకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి హామీలు అమలుకు నిర్దిష్టమైన స్పష్టమైన కాలపరిమితితో సమస్యలు పరిష్కారం చేయాలని లేని పక్షంలో భవిష్యత్తులో జరిగే పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు రాము గోపాల్ అర్జున్ ప్రసాద్ మోహన్ మగ్గన్న తదితరులు పాల్గొన్నారు.

