ఖమ్మం ఆగష్టు 8
(పున్నమి ప్రతినిధి)
ఖమ్మం: రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు శ్రీ తుమ్మల యుగేందర్ జిల్లా కలెక్టర్ శ్రీ దివాకర టీఎస్ కలిసి ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించిన పలు ప్రజా సమస్యలను వివరించారు. ఆయా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్‌తో చర్చించారు. ప్రజా సమస్యలపై కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ, సంబంధిత అంశాలను పరిశీలించి నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం అర్బన్ డీసీసీ అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, మహమ్మద్ ఆశ్రిఫ్, ఎస్కే లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.



