కూటమి ప్రభుత్వం చేనేత రంగానికి పూర్వవైభవం తీసుకురావడమే ధ్యేయంగా పనిచేస్తోందని శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తెలిపారు. “నేతన్నల సేవలో” పథకం కింద సొంతంగా మగ్గం ఉండి అర్హత సాధించిన ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ.25,000 ఆర్థిక సాయం అందించే నిధులను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. చేనేత కార్మికుల కష్టాలను గుర్తించి, ఇచ్చిన మాట ప్రకారం భరోసానిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నియోజకవర్గ ప్రజలు, చేనేత వర్గాల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చేనేత కళే ప్రాణమని, రాత్రింబవళ్లు శ్రమించే నేతన్నల రుణం తీర్చుకోలేనిదని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సాయం నియోజకవర్గంలోని వందలాది చేనేత కుటుంబాలకు ఎంతగానో దోహదపడుతుందని చెబుతూ, చేనేత రంగ బలోపేతానికి, నేతన్నల సంక్షేమానికి తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు.

చేనేత సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట-ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి