ఖమ్మం ఆగస్టు 7
(పున్నమి ప్రతినిధి)
నిజాంపేట సెక్టార్ బ్రాహ్మణ బజార్-2 పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం అన్నప్రసన్న కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ శ్రీమతి విజయ్ కుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఖమ్మం జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి మంద సరస్వతి పాల్గొని చిన్నారులు, తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. అంగన్వాడీ టీచర్లు ప్రసన్న, గీతా భవాని, ఆయమ్మ కళావతితో పాటు లబ్ధిదారులు, తల్లులు, స్థానికులు పాల్గొన్నారు. చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం, సర్వతోముఖ అభివృద్ధికి అంగన్వాడీ కేంద్రాల సేవలను వారు కొనియాడారు.



