Friday, 7 August 2026
  • Home  
  • నాయుడుపేటలో జరిగిన డీఎస్సీ రిలే నిరాహార దీక్షలు పై స్పందించిన మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం
- తిరుపతి

నాయుడుపేటలో జరిగిన డీఎస్సీ రిలే నిరాహార దీక్షలు పై స్పందించిన మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం

⛔నాయుడుపేటలో జరిగిన డీఎస్సీ రిలే నిరాహార దీక్షలు పై స్పందించిన మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం పున్నమి న్యూస్ రిపోర్టర్ మద్దాలి వెంకయ్య దొరవారిసత్రం 07-08-26 📌తిరుపతి జిల్లా నాయుడుపేటలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం సమీపంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలపై మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం తీవ్రస్థాయిలో స్పందించారు. 📌డీఎస్సీ నియామకాల అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవద్దని ఆయన సూచించారు. 📌ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలనే డిమాండ్‌కు ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. 📌విద్యారంగంలో పలు సంస్కరణలు చేపట్టడంతో పాటు, రాష్ట్రానికి పెట్టుబడులు మరియు కంపెనీలను తీసుకురావడంలో నారా లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. 📌అలాగే ‘తల్లికి వందనం’ వంటి సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్న ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేయడం సరికాదన్నారు. 📌డీఎస్సీ అంశంపై వైఎస్సార్సీపీ నాయకులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని విమర్శించారు. 📌మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యను ఉద్దేశించి మాట్లాడుతూ, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీక్షల పేరుతో ఇబ్బందులు పడకుండా ఆందోళనలను విరమించుకోవాలని సూచించారు. 📌ఇప్పటికైనా నిరాహార దీక్షలను విరమించి ప్రజా సమస్యలపై నిర్మాణాత్మకంగా పనిచేయాలని తెలియజేశారు.

⛔నాయుడుపేటలో జరిగిన డీఎస్సీ రిలే నిరాహార దీక్షలు పై స్పందించిన మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం

పున్నమి న్యూస్ రిపోర్టర్ మద్దాలి వెంకయ్య దొరవారిసత్రం 07-08-26

📌తిరుపతి జిల్లా నాయుడుపేటలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం సమీపంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలపై మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం తీవ్రస్థాయిలో స్పందించారు.

📌డీఎస్సీ నియామకాల అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవద్దని ఆయన సూచించారు.

📌ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలనే డిమాండ్‌కు ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు.

📌విద్యారంగంలో పలు సంస్కరణలు చేపట్టడంతో పాటు, రాష్ట్రానికి పెట్టుబడులు మరియు కంపెనీలను తీసుకురావడంలో నారా లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.

📌అలాగే ‘తల్లికి వందనం’ వంటి సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్న ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

📌డీఎస్సీ అంశంపై వైఎస్సార్సీపీ నాయకులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని విమర్శించారు.

📌మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యను ఉద్దేశించి మాట్లాడుతూ, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీక్షల పేరుతో ఇబ్బందులు పడకుండా ఆందోళనలను విరమించుకోవాలని సూచించారు.

📌ఇప్పటికైనా నిరాహార దీక్షలను విరమించి ప్రజా సమస్యలపై నిర్మాణాత్మకంగా పనిచేయాలని తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.