తిరుచానూరు, ఆగస్టు 6 (పున్నమి ప్రతినిధి)
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని గురువారం మైసూర్ వ్యాసరాజ మఠం పీఠాధిపతి విద్యా మనోహర తీర్థం స్వామీజీ దర్శించుకున్నారు. ఆలయం వద్ద వారికి ఆలయ సూపరింటెండెంట్లు సురేష్, ముని చెంగల్రాయలు అర్చకులు బాబుస్వామి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.


