తిరుపతి ఆగస్టు 06 (పున్నమి ప్రతినిధి)
ఓ హత్యకేసులో ప్రత్యక్షసాక్షి కిడ్నాప్ కేసు రాజకీయ ప్రకంపనలకు నాంది పలికింది. TDP ఇన్ఛార్జ్ JB శ్రీనివాస్ ఇంటి వద్ద హత్యకు గురైన బెల్ట్ మురళి భార్యతో పాటు మరికొందరు నిరసనకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఓ హత్య కేసులో సాక్షిని కిడ్నాప్ చేసి, తిరుపతిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా YCP చర్యలున్నాయని TDP ఆరోపిస్తుంటే.. సాక్ష్యాలను తారుమారు చేసే పనిలో TDP ఉందని YCP విమర్శిస్తోంది.


