ఖమ్మం, ఆగస్టు 4:
(పున్నమి న్యూస్)
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. పలు మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలతో చెరువులు, కుంటలు, వాగులు జలకళ సంతరించుకుంటుండగా, సాగు పంటలకు సమృద్ధిగా నీరు అందుతుండటంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు నిరంతర వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ తీగల సమీపానికి వెళ్లొద్దని, విద్యుత్ సంబంధిత సమస్యలు కనిపిస్తే వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.



