ఆగస్టు 03 పున్నమి ప్రతినిధి
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండల ‘సంఘటన్ శ్రీజన్ అభయాన్’ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ సోయం బాపూరావు
సామాజిక న్యాయం, మహిళా ప్రాధాన్యతతో మండల కమిటీల ఏర్పాటు
పార్టీ కోసం శ్రమించే ప్రతి కార్యకర్తకూ తగిన గుర్తింపు
*ఆగస్టు 15 లోగా కమిటీల ప్రక్రియ పూర్తి కావాలి*
కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతంలో భాగంగా చేపట్టిన ‘సంఘటన్ శ్రీజన్ అభియాన్ ’ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎంపీ సోయం బాపూరావు గారు ఆదిలాబాద్ జిల్లా లో విస్తృత పర్యటన చేపట్టారు. జిల్లా అధ్యక్షులు నరేష్ జాదవ్ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి గార్లతో కలిసి ఆయన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల ముఖ్య సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మండల కమిటీల ఏర్పాటు మరియు పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులకు దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్బంగా సోయం బాపూరావు సోయం మాట్లాడుతూ నూతన మండల కమిటీల నియామకంలో ఎలాంటి వర్గ విభేదాలకు తావులేకుండా అందరినీ కలుపుకొనిపోవాలని, సామాజిక న్యాయం పాటిస్తూ పారదర్శకంగా కమిటీలను సిద్ధం చేయాలని సూచించారు.
ప్రతి మండల కమిటీలో మండల అధ్యక్షునితో కలిపి మొత్తం 21 మంది సభ్యులు ఉండాలి. ఇందులో ఇద్దరు ఉపాధ్యక్షులు, నలుగురు ప్రధాన కార్యదర్శులు (జనరల్ సెక్రటరీలు) మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్లు ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. పార్టీ కమిటీలలో మహిళా నాయకులకు, కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత కల్పించాలన్నారు.సీనియర్ నాయకులు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ల అనుభవాన్ని ఉపయోగించుకునేలా ప్రతి మండలంలో ‘పొలిటికల్ అఫైర్స్ కమిటీ’ (pac )ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు, జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కమిటీల ఏర్పాటు ప్రక్రియను ఆగస్టు 15 లోగా పూర్తి చేయాలని గడువు విధించారు.అలాగే గ్రామస్థాయి పూర్తిస్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. పార్టీ అభివృద్ధికి, ప్రజల సమస్యలపై అంకితభావంతో పనిచేసే ప్రతి నాయకుడిని, కార్యకర్తను పార్టీ అధిష్టానం ఖచ్చితంగా గు గుర్తించి తగిన గౌరవం అందిస్తుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వారితోపాటు జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నరసయ్య గారు, ఆదిలాబాద్ మార్కెట్ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి గారు,
మాజీ డిసిసి సాజీద్ ఖాన్ గారు,
మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవ రెడ్డి గారు, మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవ రెడ్డి గారు,
జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మాధవ్ పటేల్ గారు, గిమ్మ దీపక్ గారు, రాష్ట్ర ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు సెద్మకి ఆనందరావు గారు, అదేవిధంగా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర సెక్రెటరీ శాంతన్ రావు గారు
జిల్లా జనరల్ సెక్రటరీ లు గౌలి సంజీవ్ కుమార్ గారు,మల్యాల కరుణాకర్ గారు, అక్తర్ అలీ గారు, లక్ష్మ రెడ్డి గారు,మాజీ టీటీడీ బోర్డు మెంబర్ బెజ్జంకి అనిల్ గారు,కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ రూరల్ మండల అధ్యక్షుడు వెంకట్ యాదవ్ గారు, జిల్లా జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సుధాకర్ గౌడ్ గారు, అదిలాబాదు రూరల్ మండల మాజీ వైస్ ఎంపీపీ ఎల్టీ భోజ రెడ్డి గారు, మా మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంజయ్ దూబే గారు,మాజీ జడ్పీటీసీ కొండా గంగాధర్ గారు,పొచ్చేరా సర్పంచ్ గంగన్న, అంకోలి గ్రామ సర్పంచ్ మాడవి కిషన్ గారు, ఎస్ఎస్ఎల్ జిల్లా సెక్రెటరీ పుండ్ర నర్సింగ్ గారు, అదిలాబాద్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు బాలు గారు,మాజీ ఎంపీటీసీలు సింగిల్ విండో చైర్మన్, డైరెక్టర్లు పాల్గొన్నారు.



