Monday, 3 August 2026
  • Home  
  • “శిశు వికాస్ యోజన”ను సద్వినియోగం చేసుకోండి. – హెడ్మాస్టర్ సుజాతచే సభ్యత్వ పత్రం అందజేత
- తిరుపతి

“శిశు వికాస్ యోజన”ను సద్వినియోగం చేసుకోండి. – హెడ్మాస్టర్ సుజాతచే సభ్యత్వ పత్రం అందజేత

తిరుపతి,ఆగస్టు 03 (పున్నమి ప్రతినిధి) ఒకటి నుంచి పదవ తరగతి లోపు విద్యార్థులకు సి ఎస్ ఆర్ ఫండ్స్ ద్వారా శిశు వికాస్ యోజన పథకం అందించే సౌకర్యాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తుమ్మవానికుంట హెడ్మాస్టర్ సుజాత పేర్కొన్నారు. పివిఆర్ గ్రూప్ ఆర్గనైజేషన్ చే ఆ పాఠశాలకు చెందిన డింపుల్, సాయి తేజలకు శిశు వికాస్ యోజన సభ్యత్వ పత్రాన్ని అందజేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులు రాష్ట్ర సూపర్వైజర్ వెంకటరమణ, కోఆర్డినేటర్ లక్ష్మయ్య, జిల్లా ఇంచార్జ్ సుకుమార్ రాజులు మాట్లాడుతూ శిశు వికాస్ యోజన ప్రయోజనాలను వివరించారు. సభ్యత్వం పొందిన ప్రతి విద్యార్థి ఏడాదిలో చికిత్స కోసం 25 వేల గ్రాంటు, ఉన్నత విద్య కోసం ఐదు లక్షల స్కాలర్షిప్, మూడులక్షల ప్రాణ నష్టపరిహారం లతోపాటు ఐదు నుంచి 10వ తరగతి వరకు ప్రతి ఏటా 3000 నుంచి 5000 వరకు స్కాలర్షిప్లు, 21 సంవత్సరాల తరువాత ఐదు సంవత్సరాల పాటు ఏటా రెండు లక్షల వరకు వడ్డీ లేని రుణం అందజేస్తారని వివరించారు. ఎన్రోల్ కావడానికి విద్యార్థి ఆధార కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, తల్లితండ్రుల ఆధార కార్డు పాన్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ కాపీలు అందజేసి ఫ్యామిలీ గ్రూప్ ఫోటో తో సభ్యత్వం పొందవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో వీరితోపాటు హెడ్మాస్టర్ ప్రవీణ్, కంప్యూటర్ ఆపరేటర్ వి ధరణి పతి, కోఆర్డినేటర్లు ప్రసన్న కుమారి, రాజేశ్వరి, ఉమాపతి ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

తిరుపతి,ఆగస్టు 03 (పున్నమి ప్రతినిధి)

ఒకటి నుంచి పదవ తరగతి లోపు విద్యార్థులకు సి ఎస్ ఆర్ ఫండ్స్ ద్వారా శిశు వికాస్ యోజన పథకం అందించే సౌకర్యాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తుమ్మవానికుంట హెడ్మాస్టర్ సుజాత పేర్కొన్నారు. పివిఆర్ గ్రూప్ ఆర్గనైజేషన్ చే ఆ పాఠశాలకు చెందిన డింపుల్, సాయి తేజలకు శిశు వికాస్ యోజన సభ్యత్వ పత్రాన్ని అందజేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులు రాష్ట్ర సూపర్వైజర్ వెంకటరమణ, కోఆర్డినేటర్ లక్ష్మయ్య, జిల్లా ఇంచార్జ్ సుకుమార్ రాజులు మాట్లాడుతూ శిశు వికాస్ యోజన ప్రయోజనాలను వివరించారు. సభ్యత్వం పొందిన ప్రతి విద్యార్థి ఏడాదిలో చికిత్స కోసం 25 వేల గ్రాంటు, ఉన్నత విద్య కోసం ఐదు లక్షల స్కాలర్షిప్, మూడులక్షల ప్రాణ నష్టపరిహారం లతోపాటు ఐదు నుంచి 10వ తరగతి వరకు ప్రతి ఏటా 3000 నుంచి 5000 వరకు స్కాలర్షిప్లు, 21 సంవత్సరాల తరువాత ఐదు సంవత్సరాల పాటు ఏటా రెండు లక్షల వరకు వడ్డీ లేని రుణం అందజేస్తారని వివరించారు. ఎన్రోల్ కావడానికి విద్యార్థి ఆధార కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, తల్లితండ్రుల ఆధార కార్డు పాన్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ కాపీలు అందజేసి ఫ్యామిలీ గ్రూప్ ఫోటో తో సభ్యత్వం పొందవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో వీరితోపాటు హెడ్మాస్టర్ ప్రవీణ్, కంప్యూటర్ ఆపరేటర్ వి ధరణి పతి, కోఆర్డినేటర్లు ప్రసన్న కుమారి, రాజేశ్వరి, ఉమాపతి ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.