Monday, 3 August 2026
  • Home  
  • దూరవిద్య డిగ్రీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం..!
- అనకాపల్లి

దూరవిద్య డిగ్రీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం..!

అనకాపల్లి జిల్లా, ఆగస్టు 3 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): యలమంచిలి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దూరవిద్య అధ్యయన సమన్వయ కేంద్రం–68 ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి యూజీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు స్థానిక శ్రీ గురజాడ అప్పారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రేమా చంద్రశేఖర్ తెలిపారు. ఎలమంచిలిలోని ఈ కేంద్రంలో బీఏ, బీకాం (కంప్యూటర్ అప్లికేషన్), బీఎస్సీ, బీఎల్‌ఐఎస్‌సీ కోర్సులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 15, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారని, ఆసక్తి గల అభ్యర్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం దూరవిద్య అధ్యయన కేంద్రాన్ని సంప్రదించవచ్చని లేదా 9491332811 నంబర్‌కు ఫోన్ చేయవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని దూరవిద్య అధ్యయన కేంద్ర సమన్వయకర్త ఎం. కిషోర్ కోరారు.

అనకాపల్లి జిల్లా, ఆగస్టు 3 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): యలమంచిలి
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దూరవిద్య అధ్యయన సమన్వయ కేంద్రం–68 ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి యూజీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు స్థానిక శ్రీ గురజాడ అప్పారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రేమా చంద్రశేఖర్ తెలిపారు. ఎలమంచిలిలోని ఈ కేంద్రంలో బీఏ, బీకాం (కంప్యూటర్ అప్లికేషన్), బీఎస్సీ, బీఎల్‌ఐఎస్‌సీ కోర్సులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 15, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారని, ఆసక్తి గల అభ్యర్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం దూరవిద్య అధ్యయన కేంద్రాన్ని సంప్రదించవచ్చని లేదా 9491332811 నంబర్‌కు ఫోన్ చేయవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని దూరవిద్య అధ్యయన కేంద్ర సమన్వయకర్త ఎం. కిషోర్ కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.