రాజన్న సిరిసిల్ల ఆగస్టు 2 (పున్నమి ప్రతినిధి)
ఈరోజు ముస్తాబాద్ మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ యూత్ కాంగ్రెస్ నాయకుడు అగ్రహారం కిషన్ తండ్రి అనారోగ్యంతో మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుని చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ధైర్యంగా ఉండాలని ఓదార్పు పలికారు.
ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజ్జల రాజు, మాజీ ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్, కేకే యువసేన నాయకులు ఆరుట్ల మహేష్, ఉప సర్పంచ్ వినయ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్లటి నరేష్‌తో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


