Monday, 3 August 2026
  • Home  
  • బీజేపీ నేతలతో నల్లారి భేటీ
- తూర్పు గోదావరి

బీజేపీ నేతలతో నల్లారి భేటీ

రాజమహేంద్రవరం, ఆగస్టు 2 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): తూర్పుగోదావరి జిల్లా బీజేపీ ముఖ్య నాయకుల సమావేశం రాజమహేంద్రవరంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించారు. జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకులు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొమ్ముల దత్తు, కోర్ కమిటీ సభ్యులు, జిల్లా బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యక్రమాలు, జిల్లాలో పార్టీ కార్యకలాపాల విస్తరణ తదితర అంశాలపై నాయకులు చర్చించారు.

రాజమహేంద్రవరం, ఆగస్టు 2 (రమేష్ నాయుడు  పున్నమి ప్రతినిధి): తూర్పుగోదావరి జిల్లా బీజేపీ ముఖ్య నాయకుల సమావేశం రాజమహేంద్రవరంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించారు. జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకులు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొమ్ముల దత్తు, కోర్ కమిటీ సభ్యులు, జిల్లా బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యక్రమాలు, జిల్లాలో పార్టీ కార్యకలాపాల విస్తరణ తదితర అంశాలపై నాయకులు చర్చించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.