*పత్రికా ప్రకటన* పున్నమి న్యూస్ దొరవారిసత్రం మద్దాలి వెంకయ్య
*నాయుడుపేట వ్యవసాయ మార్కెట్ తనిఖీ కేంద్రాన్ని పరిశీలించిన మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు*
*నాయుడుపేట, జూలై 31:*
పండ్లూరు గ్రామ సమీపంలోని *జాతీయ రహదారిపై ఉన్న నాయుడుపేట వ్యవసాయ మార్కెట్ తనిఖీ కేంద్రాన్ని* మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు ఈరోజు సందర్శించి, కేంద్రంలో అమలవుతున్న తనిఖీ విధానాలు, సౌకర్యాలు, పరిపాలనా వ్యవస్థను మరియు ఈ-పర్మిట్ (E-Permit) అమలుచేస్తున్న విధానాన్ని సమగ్రంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా తనిఖీలో భాగంగా విచ్చేసిన *గుంటూరు మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ శ్రీ పఠాన్ శెట్టి రవి సుభాష్, IAS గారికి, నాయుడుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ శ్రీ ఉయ్యాల ప్రవీణ్ గారు సాదర స్వాగతం పలికారు. అనంతరం *శ్రీ పఠాన్ శెట్టి రవి సుభాష్ IAS గారు*, *కడప రీజియన్ జాయింట్ డైరెక్టర్ శ్రీ Ch. రామాంజనేయులు గారు* మరియు *కడప డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి లావణ్య గారు* తనిఖీ కేంద్రంలోని రికార్డులు, ఈ-పర్మిట్ (E-Permit) విధానం, రైతులకు అందిస్తున్న సేవలు, వాహనాల తనిఖీ ప్రక్రియ, సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు, మార్గదర్శకాలు అందజేశారు.
అనంతరం ఉన్నత అధికారులు మార్కెట్ అధికారులతో సమావేశమై వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, మార్కెట్ నిర్వహణ, రైతులకు మెరుగైన సేవలు అందించే అంశాలపై సమీక్ష నిర్వహించారు. రైతులకు మరింత పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించే దిశగా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో *శ్రీ ఉయ్యాల ప్రవీణ్ గారు*, మార్కెట్ తనిఖీ కేంద్రానికి సంబంధించిన సమస్యలు, అభివృద్ధి అవసరాలు, రైతుల అభిప్రాయాలను, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అలాగే నాయుపేట పట్టణంలో ఏర్పాటు చేయనున్న రైతు బజార్ గురించి చర్చించడం జరిగింది.
ఈ పరిశీలన కార్యక్రమంలో *తిరుపతి అసిస్టెంట్ మార్కెటింగ్ అధికారి శ్రీ T. సురేంద్ర గారు*, *నాయుడుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ సహాయ కార్యదర్శి V. వెంకటేశ్వర్లు గారు*, మార్కెట్ శాఖ అధికారులు, సిబ్బంది మరియు సంబంధిత విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.
*ఇట్లు,*
*జనసేన పార్టీ కార్యాలయం*
*సూళ్లూరుపేట నియోజకవర్గం – నాయుడుపేట*

