Friday, 31 July 2026
  • Home  
  • బూత్‌ల బలోపేతమే బీజేపీ విజయానికి పునాది-రితురాజ్ సిన్హా
- తిరుపతి

బూత్‌ల బలోపేతమే బీజేపీ విజయానికి పునాది-రితురాజ్ సిన్హా

శ్రీ కాళహస్తి, జులై 31, (పున్నమి న్యూస్): పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీ సంస్థాగత వ్యవస్థను మరింత పటిష్ఠం చేయడమే భారతీయ జనతా పార్టీ విజయానికి బలమైన పునాదిగా నిలుస్తుందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి రితురాజ్ సిన్హా పేర్కొన్నారు. శ్రీకాళహస్తిలో అసెంబ్లీ కన్వీనర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ అధ్యక్షతన నిర్వహించిన బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు, శ్రీకాళహస్తి నియోజకవర్గ బీఎల్ఏ-2 (బూత్ లెవల్ ఏజెంట్లు-2) ప్రతినిధుల సమగ్ర సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా సమగ్ర ఓటరు సవరణ కార్యక్రమం పురోగతిని సమీక్షించిన నాయకులు, ప్రతి బూత్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రతి ఓటరును ప్రత్యక్షంగా కలుసుకునే విధంగా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. గ్రామ స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని విస్తరించి, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ బూత్ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. సమావేశంలో తిరుపతి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నాగోతు రమేష్ నాయుడు, సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, మాజీ ఎంపీ వరప్రసాద్ రావు, తిరుపతి జిల్లా ఇంచార్జి పులి వెంకట కృష్ణారెడ్డి, అనంతపురం జిల్లా ఇంచార్జి చంద్రప్ప, రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్, రాష్ట్ర కార్యదర్శి మేకల హనుమంతరావు పాల్గొన్నారు. అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శులు కె. నరేష్, మునికృష్ణయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, మండల అధ్యక్షులు పూజారి ప్రేమ్ కుమార్ రెడ్డి, వేడం కృష్ణయ్య, నరేష్, కోలా గోవర్ధన్‌తో పాటు నియోజకవర్గంలోని బీఎల్ఏ-2 ప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.