Friday, 31 July 2026
  • Home  
  • తెలంగాణలో SIR గడువుకు మరోసారి పొడిగింపు.. ఆగస్టు 10 వరకు అవకాశం
- ఖమ్మం

తెలంగాణలో SIR గడువుకు మరోసారి పొడిగింపు.. ఆగస్టు 10 వరకు అవకాశం

ఖమ్మం జులై (, పున్నమి న్యూస్ ) ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమం గడువును మరోసారి పొడిగించారు. ఈ నెలాఖరుతో ముగియాల్సిన గడువును ఆగస్టు 10 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ఎన్నికల అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించని ఓటర్లకు మరో అవకాశం కల్పించడమే ఈ నిర్ణయానికి కారణమని అధికారులు తెలిపారు. గతంలో జూలై 24తో ముగియాల్సిన గడువును ఆగస్టు 3 వరకు పొడిగించగా, ప్రస్తుతం మరోసారి ఆగస్టు 10 వరకు గడువు పెంచారు. ఇప్పటివరకు దాదాపు 3 కోట్ల రేషన్ కార్డులు, పోలింగ్ స్టేషన్‌ల వారీగా ఏర్పాటైన కేంద్రాల ద్వారా ఎన్యుమరేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఆగస్టు 10 వరకు డ్రాఫ్ట్ ఓటరు జాబితా వివరాలు, క్లెయిమ్‌లు, అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అనంతరం ఆగస్టు 12 నుంచి తుది ఓటరు జాబితా సిద్ధం చేసే ప్రక్రియ ప్రారంభం కానుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఆగస్టు 3 వరకు మొత్తం ఓటరు సమగ్ర సవరణకు గడువు ఉండగా, మరొసారి గడువును పెంచడంతో ఆగస్టు 10 వరకు ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించేందుకు అవకాశం కల్పించారు.

ఖమ్మం జులై
(, పున్నమి న్యూస్ )

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమం గడువును మరోసారి పొడిగించారు. ఈ నెలాఖరుతో ముగియాల్సిన గడువును ఆగస్టు 10 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ఎన్నికల అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటి వరకు ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించని ఓటర్లకు మరో అవకాశం కల్పించడమే ఈ నిర్ణయానికి కారణమని అధికారులు తెలిపారు. గతంలో జూలై 24తో ముగియాల్సిన గడువును ఆగస్టు 3 వరకు పొడిగించగా, ప్రస్తుతం మరోసారి ఆగస్టు 10 వరకు గడువు పెంచారు.

ఇప్పటివరకు దాదాపు 3 కోట్ల రేషన్ కార్డులు, పోలింగ్ స్టేషన్‌ల వారీగా ఏర్పాటైన కేంద్రాల ద్వారా ఎన్యుమరేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఆగస్టు 10 వరకు డ్రాఫ్ట్ ఓటరు జాబితా వివరాలు, క్లెయిమ్‌లు, అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అనంతరం ఆగస్టు 12 నుంచి తుది ఓటరు జాబితా సిద్ధం చేసే ప్రక్రియ ప్రారంభం కానుంది.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఆగస్టు 3 వరకు మొత్తం ఓటరు సమగ్ర సవరణకు గడువు ఉండగా, మరొసారి గడువును పెంచడంతో ఆగస్టు 10 వరకు ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించేందుకు అవకాశం కల్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.