*ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య*.
పున్నమి ప్రతినిధి, తిరుపతి జూలై 31(సిపి ఎం)
జానపద గ్రామీణ వృత్తి కళాకారుల సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో ఆగస్టు 25వ తేదీన జరిగే కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాకు అన్ని రకాల కళాకారులు పెద్ద ఎత్తున హాజరుకావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం తిరుపతి బైరాగి పట్టెడ లోని సిపిఐ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి తిరుపతి జిల్లా ముఖ్యుల సమావేశం కె చారులత అధ్యక్షతన జరిగింది ఈ సమావేశమునకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య మాట్లాడుతూ కళాకారుల సమస్యలు పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైపల్యం చెందిందని కళాకారుల సమస్యల పరిష్కారం కోసం గ్రామ గ్రామాన ప్రచార కార్యక్రమాలు నిర్వహించి ఆగస్టు 25వ తేదీన పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించాలని ఆయన సూచించారు అన్ని రకాల కళాకారులందరికి ప్రభుత్వం గుర్తింపు కార్డులు మంజూరు చేయడంలో పెన్షన్లు మంజూరు చేయడంలో ఇల్లు లేని నిరుపేద కళాకారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో పూర్తిగా వైపల్యం చెందిందన్నారు . నాటక రంగ కళాకారులకు భజన కోలాటం కళాకారులకు గుర్తింపు కార్డులతో పాటు బస్సు రైళ్లలో రాయితీల తో కూడిన ప్రయాణ సౌకర్యాలలో ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు కళాకారుల పట్ల ప్రభుత్వాలకు చిన్నచూపు తగదని కళాకారులే ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలకు నిలయాలని ఆయన అన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి జింక నాగరాజు జిల్లా కళాకారులు నారాయణదాసు అయ్యప్ప ఉదయ్ కుమార్ బి నాగభూషణం చిన్నం కాళయ్య పద్మనాభ రెడ్డి భూపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


