గ్రామ స్థాయిలో పారదర్శకమైన, ప్రజా భాగస్వామ్యంతో కూడిన అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన లక్ష్యంగా కృషి చేయాలని డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ శంషాద్ భాను సూచించారు.
రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ (ఆర్ జి సి ఏ) వార్షిక కార్యాచరణ ప్రణాళిక 2026–27 లో భాగంగా, పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జి పి డి పి)పై ఒకరోజు మండల స్థాయి శిక్షణా కార్యక్రమం బుధవారం మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జి పి డి పి రూపకల్పన విధానం, గ్రామాభివృద్ధి కార్యాచరణ ప్రణాళికల ప్రాధాన్యత గురించి ఆమె వివరించారు.ఈ శిక్షణా కార్యక్రమంలో మండల స్థాయి వివిధ శాఖల అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది, డిజిటల్ అసిస్టెంట్లు,ఇంజనీరింగ్ అసిస్టెంట్లు,పంచాయతీకార్యదర్శులు,స్వయం సహాయక సంఘాలు, విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు.పాల్గొన్నారు. మొత్తంగా 80 మంది హాజరయ్యారు
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కె.ఆర్.ఎం. ప్రసాద్ , డిప్యూటీ మండల అభివృద్ధి అధికారులు జి. మాల్యాద్రి, ఎం. పద్మజ ,పరిపాలనాధికారి పి. హబిబుల్లా ఖాన్ , రిసోర్స్ పర్సన్స్ కే. ఎన్. నరసింహులు, పి డి ఓ జి. నాగ లక్ష్మి నల్లతిమయపల్లి తదితరులు పాల్గొన్నారు.


