శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారామపురం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ప్రభుత్వం ఆదేశాల మేరకు వీధి కుక్కల వల్ల కలిగే ప్రమాదాల నుండి రక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. రాఘవేంద్ర వెటర్నరీ డాక్టర్ గండిపాలెం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కుక్కల నియంత్రణ, పరిశుభ్రత మరియు ముందస్తు జాగ్రత్తలపై పలు కీలక సూచనలు చేశారు. పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచుకోవడం, వ్యర్థాలను దూరంగా వేయడం ద్వారా కుక్కల సంచారాన్ని అరికట్టవచ్చని తెలిపారు. కుక్క కరిచిన వెంటనే చేయాల్సిన ప్రథమ చికిత్స విధానం గురించి, సబ్బుతో శుభ్రం చేసి వెంటనే ఆసుపత్రికి తరలించాలని వివరించారు.
సీతారామపురం ఆదర్శ పాఠశాలలో వీధి కుక్కల బారిన పడకుండా అవగాహన సదస్సు