బలభద్రపురం, జూలై 30 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): బిక్కవోలు మండలం బలభద్రపురంలోని శ్రీ ఆంధ్ర షిర్డీ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సాయిబాబా వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని సాయిబాబాను ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, బిక్కవోలు మండల కూటమి నాయకులు, బలభద్రపురం గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


