Wednesday, 29 July 2026
  • Home  
  • గురుపౌర్ణమి వేళ సాయిబాబా ఆలయంలో డీఎస్పీ ప్రత్యేక పూజలు
- తిరుపతి

గురుపౌర్ణమి వేళ సాయిబాబా ఆలయంలో డీఎస్పీ ప్రత్యేక పూజలు

శ్రీ కాళహస్తి, జులై 29, (పున్నమి న్యూస్): గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి–చెన్నై రోడ్డులోని షిరిడి సాయినాథుని ఆలయాన్ని శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి బుధవారం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు మందిర నిర్వాహకులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ అర్చకులు డీఎస్పీకి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. అనంతరం ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించిన డీఎస్పీ భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల పరిసర ప్రాంతాల్లో దొంగతనాల ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు, వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఇంటి ముందు, వ్యాపార సంస్థలు, దుకాణాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరాల నియంత్రణతో పాటు అసాంఘిక శక్తుల కదలికలను సులభంగా గుర్తించి దర్యాప్తు వేగవంతం చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మందిర కమిటీ కార్యదర్శి జగదీష్, లీగల్ అడ్వైజర్ గుమ్మల్ల రాజేశ్వరరావు, దర్గా ఉరుసు కమిటీ చైర్మన్ ఓరుగంటి నాగేశ్వరరావు, బాబా ఫరీద్, ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.