Wednesday, 29 July 2026
  • Home  
  • పై అధికారి వేధింపుల వల్లే సెక్యూరిటీ గార్డ్ కుమారస్వామి మృతి
- News

పై అధికారి వేధింపుల వల్లే సెక్యూరిటీ గార్డ్ కుమారస్వామి మృతి

తన పై అధికారి వేధింపులు తాళలేక మనోవేదనకు గురై సింగరేణిలో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ సెక్యూరిటీ గార్డ్ కార్మికుడు కేశబోయిన కుమారస్వామి గుండెపోటుకు గురై మృతి చెందినట్లు కుమారస్వామి కుటుంబ సభ్యులు, తోటి సెక్యూరిటీ గార్డ్ కార్మికులు ఆరోపించారు. మృతుడి కుటుంబ సభ్యులు, తోటి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం బెల్లంపల్లి పట్టణం హనుమాన్ బస్తికి చెందిన కేశ బోయిన కుమారస్వామి సింగరేణి డిపార్ట్మెంట్లో ఔట్సోర్సింగ్ విధానంలో సెక్యూరిటీ గార్డ్ గా గోలేటిలో నిధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల రాత్రి సమయంలో కుమారస్వామి పనిచేస్తున్న ప్రదేశంలో దొంగలు చోరీకి ప్రయత్నించగా దొంగ దొంగ అంటూ అరిచాడు. దీంతో దొంగలు పారిపోవడం జరిగింది. అనంతరం పై అధికారులకు మృతుడు కుమారస్వామి సమాచారం ఇవ్వగా వారు వచ్చి విచారణ జరిపి అక్కడ ఎలాంటి వస్తువు దొంగతనానికి గురి కాలేదని ధ్రువీకరించినట్లు తెలిపారు. అయినప్పటికీ వీరిపై అధికారి ఏఎస్ఓ దాసరి శ్రీధర్, మృతుడు కుమారస్వామిని మరికొంతమందిని బాధ్యులను చేస్తూ వారిని రెండు రోజులపాటు పనికి రాకుండా చేయడం జరిగింది. దీంతో మనస్థాపానికి గురైన కుమారస్వామి గత రెండు రోజులుగా అదే విషయమై కుటుంబ సభ్యులకు, తోటి సెక్యూరిటీ గార్డ్ కార్మికులకు చెప్పుకుంటూ మనోవేదనకు గురయ్యాడని అన్నారు. చేయని తప్పుకు తనని బాధ్యులు చేశాడని నిత్యం బాధపడుతూ ఉన్నాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈనెల 28న కుమారస్వామి గుండెపోటుకు గురయ్యాడని ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు తెలిపారు. కుమారస్వామి మృతదేహన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గెల్లి రాజలింగు, బండి రాము, బిఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి రెవెల్లి విజయ్ సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు ఫోన్ ద్వారా మృతుడి మరణం, అధికారుల వేధింపుల గురించి వారికి వివరించినట్లు తెలిపారు. కుమారస్వామి మృతికి అతని పై అధికారి ఏఎస్ఓ శ్రీధర్ వేదింపులే కారణమని వారు ఆరోపిస్తూ మృతుడి కుటుంబానికి న్యాయం జరిగేలా నష్టపరిహారం ఇవ్వాలని, అదేవిధంగా మృతుడి భార్యకు ఉద్యోగం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో మృతుడికి న్యాయం జరిగేంతవరకు పోరాడుతామని వారు హెచ్చరించారు.

తన పై అధికారి వేధింపులు తాళలేక మనోవేదనకు గురై సింగరేణిలో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ సెక్యూరిటీ గార్డ్
కార్మికుడు కేశబోయిన కుమారస్వామి గుండెపోటుకు గురై మృతి చెందినట్లు కుమారస్వామి కుటుంబ సభ్యులు, తోటి సెక్యూరిటీ గార్డ్ కార్మికులు ఆరోపించారు. మృతుడి కుటుంబ సభ్యులు, తోటి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం బెల్లంపల్లి పట్టణం హనుమాన్ బస్తికి చెందిన కేశ బోయిన కుమారస్వామి సింగరేణి డిపార్ట్మెంట్లో ఔట్సోర్సింగ్ విధానంలో సెక్యూరిటీ గార్డ్ గా గోలేటిలో నిధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల రాత్రి సమయంలో కుమారస్వామి పనిచేస్తున్న ప్రదేశంలో దొంగలు చోరీకి ప్రయత్నించగా దొంగ దొంగ అంటూ అరిచాడు. దీంతో దొంగలు పారిపోవడం జరిగింది. అనంతరం పై అధికారులకు మృతుడు కుమారస్వామి సమాచారం ఇవ్వగా వారు వచ్చి విచారణ జరిపి అక్కడ ఎలాంటి వస్తువు దొంగతనానికి గురి కాలేదని ధ్రువీకరించినట్లు తెలిపారు. అయినప్పటికీ వీరిపై అధికారి ఏఎస్ఓ దాసరి శ్రీధర్, మృతుడు కుమారస్వామిని మరికొంతమందిని బాధ్యులను చేస్తూ వారిని రెండు రోజులపాటు పనికి రాకుండా చేయడం జరిగింది. దీంతో మనస్థాపానికి గురైన కుమారస్వామి గత రెండు రోజులుగా అదే విషయమై కుటుంబ సభ్యులకు, తోటి సెక్యూరిటీ గార్డ్ కార్మికులకు చెప్పుకుంటూ మనోవేదనకు గురయ్యాడని అన్నారు. చేయని తప్పుకు తనని బాధ్యులు చేశాడని నిత్యం బాధపడుతూ ఉన్నాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈనెల 28న కుమారస్వామి గుండెపోటుకు గురయ్యాడని ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు తెలిపారు. కుమారస్వామి మృతదేహన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గెల్లి రాజలింగు, బండి రాము, బిఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి రెవెల్లి విజయ్ సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు ఫోన్ ద్వారా మృతుడి మరణం, అధికారుల వేధింపుల గురించి వారికి వివరించినట్లు తెలిపారు. కుమారస్వామి మృతికి అతని పై అధికారి ఏఎస్ఓ శ్రీధర్ వేదింపులే కారణమని వారు ఆరోపిస్తూ మృతుడి కుటుంబానికి న్యాయం జరిగేలా నష్టపరిహారం ఇవ్వాలని, అదేవిధంగా మృతుడి భార్యకు ఉద్యోగం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో మృతుడికి న్యాయం జరిగేంతవరకు పోరాడుతామని వారు హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.