Wednesday, 29 July 2026
  • Home  
  • గురు పౌర్ణమి వేళ సాయిబాబాకు విశేష పూజలు మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావుకు సన్మానం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గురు పౌర్ణమి వేళ సాయిబాబాకు విశేష పూజలు మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావుకు సన్మానం

గురు పౌర్ణమి సందర్భంగా వరికుంటపాడు శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు సుంకర వెంకటాద్రి, శ్రీమతి సుజన ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో సాయిబాబాకు అభిషేకాలు, గురుపూజ, మహామంగళహారతి నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ వ్యవస్థాపకులు సుంకర వెంకటాద్రి, శ్రీమతి సృజన లు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువుల బోధనలు సమాజానికి మార్గదర్శకమని, సాయిబాబా చూపిన సేవా మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని సూచించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

గురు పౌర్ణమి సందర్భంగా వరికుంటపాడు శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు సుంకర వెంకటాద్రి, శ్రీమతి సుజన ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో సాయిబాబాకు అభిషేకాలు, గురుపూజ, మహామంగళహారతి నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ వ్యవస్థాపకులు సుంకర వెంకటాద్రి, శ్రీమతి సృజన లు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువుల బోధనలు సమాజానికి మార్గదర్శకమని, సాయిబాబా చూపిన సేవా మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని సూచించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.