బద్రాద్రి.కొత్తగూడెం. జూలై. 29.(పున్నమి వార్తలు)
తెలంగాణలో రేషన్ కార్డుల ఈ-కేవైసీ (e-KYC) పూర్తి
చేయడానికి జులై 31 వరకు పౌర సరఫరాల శాఖ గడువు
విధించింది. అయితే ఈ గడువు మరో రెండు రోజుల్లో
ముగియనుంది. లబ్ధిదారులు తమ సమీపంలోని రేషన్
దుకాణానికి లేదా మీ-సేవ కేంద్రానికి వెళ్లి బయోమెట్రిక్
లేదా ఐరిస్ (కంటిపాప) వెరిఫికేషన్ ద్వారా ఈ ప్రక్రియను
ఉచితంగా పూర్తి చేసుకోవచ్చు. గడువులోగా కేవైసీ
చేసుకోకపోతే రేషన్ కార్డు నుంచి పేర్లు తొలగించె
అవకాశం ఉంది. ఉచిత బియ్యం కోటా నిలిచిపోవడం,
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకపోవచ్చు.



