Wednesday, 29 July 2026
  • Home  
  • కొండాయపాలెం దుర్గంపల్లిలో పారిశుధ్య పనులు ముమ్మరం – కొత్త మంచినీటి ట్యాంక్ ఏర్పాటు హామీ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కొండాయపాలెం దుర్గంపల్లిలో పారిశుధ్య పనులు ముమ్మరం – కొత్త మంచినీటి ట్యాంక్ ఏర్పాటు హామీ

ఉదయగిరి మండలం కొండాయపాలెం పంచాయతీ పరిధిలోని దుర్గంపల్లి గ్రామంలో మంగళవారం పారిశుధ్య మెరుగుదల కోసం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పంచాయతీ సెక్రటరీ భవానీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్ అంకయ్య ఆధ్వర్యంలో గ్రామంలోని మంచినీటి పథకాల పరిసరాలు, ఇతర ప్రాంతాల్లో నిల్వ ఉన్న మురుగునీటిని తొలగించి పరిశుభ్రత చర్యలు చేపట్టారు. దోమలు, వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు గ్రామంలోని పలు ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. గ్రామ ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యం కల్పించేందుకు త్వరలో కొత్త మంచినీటి వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు కూడా సహకరించాలని వారు కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.