Wednesday, 29 July 2026
  • Home  
  • శ్రీకాళహస్తీశ్వరుని సేవలో రాష్ట్ర అడిషనల్ సీఈవో వెంకటేశ్వర్లు
- తిరుపతి

శ్రీకాళహస్తీశ్వరుని సేవలో రాష్ట్ర అడిషనల్ సీఈవో వెంకటేశ్వర్లు

శ్రీ కాళహస్తి, జులై 28, (పున్నమి న్యూస్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) వెంకటేశ్వర్లు మంగళవారం శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాన్ని సందర్శించి శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞానప్రసూనాంబ అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న ఆయనకు శ్రీకాళహస్తి మండల తహసిల్దార్ టీవీ సుబ్రహ్మణ్యం పుష్పగుచ్ఛం అందించి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అధికారులు ఆయనకు ఆలయ సంప్రదాయాల ప్రకారం ఘనస్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయంలో ప్రవేశించిన అడిషనల్ సీఈవో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం ఆలయ మండపంలో అధికారులు ఆయనకు స్వామివారి పవిత్ర తీర్థప్రసాదాలను, శేషవస్త్రాన్ని అందజేసి గౌరవపూర్వకంగా సత్కరించారు. ఈ ఉన్నతాధికారి ఆధ్యాత్మిక పర్యటనలో ఆలయ సిబ్బంది, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొని ఏర్పాట్లను విజయవంతం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.