వరికుంటపాడు మండలం గణేశ్వరపురం గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమాన్ని మంగళవారం పార్టీ క్లస్టర్ కో-కన్వీనర్ పేరం సుధాకర్ రెడ్డి స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వివరించారు. అనంతరం పార్టీ కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. ప్రజలకు అందుతున్న సంక్షేమ ఫలాలను వివరించి, పార్టీ మరింత బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, ప్రదక్షిణం రాజశేఖర్, లేగల నాగార్జున, లేగల శ్రీనివాసులు, గంట ఖాజావలి, మెడగం వెంకటేశ్వర్లు, బోనముక్కల సాయి మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

ఇంటింటికీ టీడీపీ కరపత్రాల పంపిణీ