Monday, 27 July 2026
  • Home  
  • కార్మికుల వేతనాలు పెంచాలి.. లేబర్ కోడ్స్ రద్దు చేయాలి
- అనకాపల్లి

కార్మికుల వేతనాలు పెంచాలి.. లేబర్ కోడ్స్ రద్దు చేయాలి

అనకాపల్లి జిల్లా, అచ్చుతాపురం | జూలై 27 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్: అచ్చుతాపురంలో కార్మికుల వేతనాల పెంపు, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దు డిమాండ్లతో సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రచార జాత నిర్వహించారు. ఎస్‌ఈజెడ్‌, ఫార్మా, బ్రాండిక్స్‌, స్కీమ్‌ వర్కర్లకు కనీస వేతనాలు పెంచాలని, ఈ నెల 30, 31 తేదీల్లో అనకాపల్లి కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న ధర్నాను కార్మికులంతా పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్‌. రాము మాట్లాడుతూ.. 2017 నుంచి ఇప్పటివరకు కనీస వేతనాల జీవోలను ప్రభుత్వం సవరించకపోవడంతో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నప్పటికీ వేతనాలు పెరగకపోవడంతో కార్మిక కుటుంబాలు పిల్లల చదువులు, వైద్యం, ఇంటి అద్దెలు, విద్యుత్‌, రవాణా తదితర ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ జీవోలు సవరించాలని, కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేయాలని, కార్మికులకు నష్టదాయకంగా ఉన్న లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 30, 31 తేదీల్లో కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాకు కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు చలపతి, కార్మికులు రాజు, చిన్న తదితరులతో పాటు మహిళా కార్మికులు పాల్గొన్నారు.

అనకాపల్లి జిల్లా, అచ్చుతాపురం | జూలై 27 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్:
అచ్చుతాపురంలో కార్మికుల వేతనాల పెంపు, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దు డిమాండ్లతో సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రచార జాత నిర్వహించారు. ఎస్‌ఈజెడ్‌, ఫార్మా, బ్రాండిక్స్‌, స్కీమ్‌ వర్కర్లకు కనీస వేతనాలు పెంచాలని, ఈ నెల 30, 31 తేదీల్లో అనకాపల్లి కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న ధర్నాను కార్మికులంతా పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్‌. రాము మాట్లాడుతూ.. 2017 నుంచి ఇప్పటివరకు కనీస వేతనాల జీవోలను ప్రభుత్వం సవరించకపోవడంతో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నప్పటికీ వేతనాలు పెరగకపోవడంతో కార్మిక కుటుంబాలు పిల్లల చదువులు, వైద్యం, ఇంటి అద్దెలు, విద్యుత్‌, రవాణా తదితర ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ జీవోలు సవరించాలని, కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేయాలని, కార్మికులకు నష్టదాయకంగా ఉన్న లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 30, 31 తేదీల్లో కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాకు కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు చలపతి, కార్మికులు రాజు, చిన్న తదితరులతో పాటు మహిళా కార్మికులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.