Monday, 27 July 2026
  • Home  
  • పార్టీ బలోపేతమే లక్ష్యం.. పొలమూరులో బీజేపీ సంస్థాగత సమావేశం
- తూర్పు గోదావరి

పార్టీ బలోపేతమే లక్ష్యం.. పొలమూరులో బీజేపీ సంస్థాగత సమావేశం

అనపర్తి, జూలై 27 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): అనపర్తి మండలం పొలమూరులో అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ సంస్థాగత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా బీజేపీ ఇన్‌చార్జి బుద్దా లక్ష్మీనారాయణ, తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి, బీజేపీ BLA-1 ఎం.ఎస్.కె. రాజు, జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి రజని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, కార్యకర్తలను సమన్వయం చేయడం తదితర అంశాలపై నాయకులు చర్చించారు. రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన చర్యలపై కూడా సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ పరిశీలకులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అనపర్తి, జూలై 27 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి):
అనపర్తి మండలం పొలమూరులో అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ సంస్థాగత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా బీజేపీ ఇన్‌చార్జి బుద్దా లక్ష్మీనారాయణ, తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి, బీజేపీ BLA-1 ఎం.ఎస్.కె. రాజు, జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి రజని తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, కార్యకర్తలను సమన్వయం చేయడం తదితర అంశాలపై నాయకులు చర్చించారు. రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన చర్యలపై కూడా సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.

కార్యక్రమంలో అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ పరిశీలకులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.