Monday, 27 July 2026
  • Home  
  • సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో విద్యార్థినులకు ప్రత్యేక వస్తువుల పంపిణీ
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో విద్యార్థినులకు ప్రత్యేక వస్తువుల పంపిణీ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో సోమవారం కూటమి ప్రభుత్వం విద్యార్థినుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వసతుల కింద వివిధ ఉపయోగకరమైన ప్రత్యేక వస్తువులను శాసనసభ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, విద్య, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన అనంతరం విద్యారంగంలో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.అందులో భాగంగానే ప్రభుత్వ వసతి గృహాల్లో నివసిస్తున్న బాలికలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా, సురక్షితమైన, పరిశుభ్రమైన మరియు సౌకర్యవంతమైన వాతావరణంలో విద్యాభ్యాసం కొనసాగించేందుకు అవసరమైన వివిధ ఉపయోగకరమైన వస్తువులను ప్రభుత్వం అందజేస్తోందన్నారు.అనంతరం విద్యార్థినులతో ఆప్యాయంగా ముచ్చటించిన దాట్ల సుబ్బరాజు వసతి గృహంలో ఎటువంటి సమస్యలు లేదా ఇబ్బందులు ఉన్నా నిర్భయంగా తెలియజేయాలని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు సక్రమంగా అందుతున్నాయా లేదా అనే విషయాన్ని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు.తదుపరి వసతి గృహంలోని వసతి గదులు, భోజనశాల, తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్య నిర్వహణతో పాటు ఇతర మౌలిక వసతులను స్వయంగా పరిశీలించి, విద్యార్థినులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం నగర పంచాయతీ కమిషనర్ మీ రవి వర్మ, సీనియర్ నాయకులు గొలకోటి దొరబాబు,తాడి నరసింహారావు,సాగిరాజు సూరిబాబు రాజు,ములపర్తి బాలకృష్ణ,కాశి లాజర్,సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, హాస్టల్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో సోమవారం కూటమి ప్రభుత్వం విద్యార్థినుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వసతుల కింద వివిధ ఉపయోగకరమైన ప్రత్యేక వస్తువులను శాసనసభ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, విద్య, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన అనంతరం విద్యారంగంలో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.అందులో భాగంగానే ప్రభుత్వ వసతి గృహాల్లో నివసిస్తున్న బాలికలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా, సురక్షితమైన, పరిశుభ్రమైన మరియు సౌకర్యవంతమైన వాతావరణంలో విద్యాభ్యాసం కొనసాగించేందుకు అవసరమైన వివిధ ఉపయోగకరమైన వస్తువులను ప్రభుత్వం అందజేస్తోందన్నారు.అనంతరం విద్యార్థినులతో ఆప్యాయంగా ముచ్చటించిన దాట్ల సుబ్బరాజు వసతి గృహంలో ఎటువంటి సమస్యలు లేదా ఇబ్బందులు ఉన్నా నిర్భయంగా తెలియజేయాలని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు సక్రమంగా అందుతున్నాయా లేదా అనే విషయాన్ని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు.తదుపరి వసతి గృహంలోని వసతి గదులు, భోజనశాల, తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్య నిర్వహణతో పాటు ఇతర మౌలిక వసతులను స్వయంగా పరిశీలించి, విద్యార్థినులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం నగర పంచాయతీ కమిషనర్ మీ రవి వర్మ, సీనియర్ నాయకులు గొలకోటి దొరబాబు,తాడి నరసింహారావు,సాగిరాజు సూరిబాబు రాజు,ములపర్తి బాలకృష్ణ,కాశి లాజర్,సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, హాస్టల్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.