Monday, 27 July 2026
  • Home  
  • ఉదయగిరి ప్రభుత్వ వ్యవసాయ కళాశాలలో ప్రగడ కోటయ్య 111వ జయంతి వేడుకలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి ప్రభుత్వ వ్యవసాయ కళాశాలలో ప్రగడ కోటయ్య 111వ జయంతి వేడుకలు

ఉదయగిరి ప్రభుత్వ వ్యవసాయ కళాశాలలో ప్రగడ కోటయ్య 111వ జయంతి వేడుకలు ఉదయగిరి ప్రభుత్వ వ్యవసాయ కళాశాలలో సోమవారం ప్రగడ కోటయ్య 111వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల అసోసియేట్ డీన్ గోపి కృష్ణ ప్రగడ కోటయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రగడ కోటయ్య మద్రాసులోని టెక్స్టైల్ ఇన్‌స్టిట్యూట్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసి అక్కడ సూపర్‌వైజర్‌గా పనిచేశారని తెలిపారు. చేనేత కార్మికుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ కోసం జీవితాంతం కృషి చేసి విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొని ప్రగడ కోటయ్యకు ఘన నివాళులర్పించారు.

ఉదయగిరి ప్రభుత్వ వ్యవసాయ కళాశాలలో ప్రగడ కోటయ్య 111వ జయంతి వేడుకలు
ఉదయగిరి ప్రభుత్వ వ్యవసాయ కళాశాలలో సోమవారం ప్రగడ కోటయ్య 111వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల అసోసియేట్ డీన్ గోపి కృష్ణ ప్రగడ కోటయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రగడ కోటయ్య మద్రాసులోని టెక్స్టైల్ ఇన్‌స్టిట్యూట్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసి అక్కడ సూపర్‌వైజర్‌గా పనిచేశారని తెలిపారు. చేనేత కార్మికుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ కోసం జీవితాంతం కృషి చేసి విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొని ప్రగడ కోటయ్యకు ఘన నివాళులర్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.