ఖమ్మం, జూలై
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన 136వ “మన్ కీ బాత్” కార్యక్రమాన్ని బీజేపీ ఖమ్మం జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో ఆదివారం సామూహికంగా వీక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు నరుకుళ్ల వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు మందనపు సుబ్బారావు, చిలుకూరు రమేష్, దొడ్డపునేని కృష్ణయ్య, కొండా గోపి, జిల్లా నాయకులు, మండల నాయకులు, రైతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను శాలువాలతో సత్కరించి ఘనంగా అభినందించారు. పార్టీ బలోపేతానికి కృషి చేసిన ప్రతి కార్యకర్త సేవలను కొనియాడుతూ, భవిష్యత్తులో కూడా పార్టీ అభివృద్ధి కోసం సమిష్టిగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగగా, పార్టీ కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.



