Sunday, 26 July 2026
  • Home  
  • 27–29 తేదీల్లో జిల్లావ్యాప్తంగా విత్తన మేళాల నిర్వహణ
- జయశంకర్ భూపాలపల్లి

27–29 తేదీల్లో జిల్లావ్యాప్తంగా విత్తన మేళాల నిర్వహణ

భూపాలపల్లి, జూలై 26 (పున్నమి ప్రతినిధి ): రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 27 నుంచి 29 వరకు జిల్లాలోని 12 రైతు వేదికల్లో విత్తన మేళాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం లోటు ఏర్పడే అవకాశం ఉన్నందున తక్కువ నీటితో సాగు చేయగల పంటలను రైతులు ఎంచుకోవాలని సూచించారు. వరి సాగుకు బదులుగా కంది, పెసర, మినుము, మొక్కజొన్న, కూరగాయల వంటి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తే తక్కువ నీటితో ఎక్కువ లాభాలు పొందవచ్చని పేర్కొన్నారు. మేళాల్లో నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంటాయని, రైతులు సమీప రైతు వేదికలను సందర్శించి వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు విత్తనాలు పొందాలని కోరారు. కార్యక్రమాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్, రైతులందరూ విత్తన మేళాలను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.