ఖమ్మం, జులై 25
(పున్నమి న్యూస్)
బీజేపీ ఖమ్మం పార్లమెంట్ మాజీ కంటెస్టెడ్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు జన్మదిన వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పలుచోట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి, వినోద్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ప్రజాసేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.
ఖమ్మం టూ టౌన్లో అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 53వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి శ్రీలత, బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు భూక్యా శ్యాంసుందర్ నాయక్, పూవ్వాడ నారాయణ, దాసరి వీరభద్రం తదితరులు పాల్గొని తాండ్ర వినోద్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అదే విధంగా నేలకొండపల్లి మండలంలో మండల అధ్యక్షులు పార్టి సుధాకర్ సహకారంతో యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి జేల్లా సురేష్ ఆధ్వర్యంలో వినోద్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, పార్టీ శ్రేణులతో కలిసి జన్మదినాన్ని ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
ఈ కార్యక్రమాల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తాండ్ర వినోద్ రావు ప్రజా సేవా కార్యక్రమాలు మరింత విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.



