(జయప్రతాప్ రెడ్డి నెల్లూరు బ్యూరో)
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న మెగా పేరెంట్–టీచర్స్ మీటింగ్ 4.0 (Mega PTM 4.0) కార్యక్రమంలో భాగంగా కందుకూరు బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ పాల్గొన్నారు.
విద్యార్థుల తల్లిదండ్రులను ఆప్యాయంగా పలకరించి, పాఠశాలలో ఉన్న మౌలిక వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రతి విద్యార్థిలోని ప్రతిభను వెలికితీసి, ఉన్నత లక్ష్యాల వైపు నడిపించడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు.
కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా మంచి విషయమని అన్నారు.అనంతరం విద్యార్థులతో కలిసి ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల భోజనం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్య మరియు సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ పోకూరి రాంబాబు, ఎంఈఓలు నాగపణి శర్మ, కె. సుబ్బారెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఉప్పుటూరి శ్రీనివాసులు, బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. రమణయ్య, బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని ద్వారకా రాణి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
నాణ్యమైన విద్యే ప్రభుత్వ లక్ష్యం మెగా పిటీఎంలో డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ fm
(జయప్రతాప్ రెడ్డి నెల్లూరు బ్యూరో) విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న మెగా పేరెంట్–టీచర్స్ మీటింగ్ 4.0 (Mega PTM 4.0) కార్యక్రమంలో భాగంగా కందుకూరు బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ పాల్గొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులను ఆప్యాయంగా పలకరించి, పాఠశాలలో ఉన్న మౌలిక వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రతి విద్యార్థిలోని ప్రతిభను వెలికితీసి, ఉన్నత లక్ష్యాల వైపు నడిపించడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా మంచి విషయమని అన్నారు.అనంతరం విద్యార్థులతో కలిసి ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్య మరియు సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ పోకూరి రాంబాబు, ఎంఈఓలు నాగపణి శర్మ, కె. సుబ్బారెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఉప్పుటూరి శ్రీనివాసులు, బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. రమణయ్య, బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని ద్వారకా రాణి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

