ఉదయగిరిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులకు లీప్ (LEAP) యాప్‌పై అవగాహన కల్పిస్తూ యాప్ ఇన్స్టాలేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖాధికారి (ఎంఈవో) టీ. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, లీప్ యాప్ ద్వారా విద్యార్థుల హాజరు, విద్యా పురోగతి, పరీక్షల ఫలితాలు, పాఠశాల నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం, నోటీసులు తదితర సేవలను తల్లిదండ్రులు తమ మొబైల్లోనే సులభంగా తెలుసుకోవచ్చన్నారు. ప్రతి తల్లిదండ్రి యాప్‌ను వినియోగించి పిల్లల విద్యాభివృద్ధిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

లీప్ యాప్‌పై తల్లిదండ్రులకు అవగాహన – ఉదయగిరిలో ఇన్స్టాలేషన్ కార్యక్రమం