మంత్రి నారా లోకేష్‌తో కలిసి ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కుటుంబాన్ని పరామర్శించిన టీడీపీ నేతలు
ప్రొద్దుటూరు, జూలై 15: మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారి మాతృమూర్తి శ్రీమతి పుట్టా పోలమ్మ గారి మరణం పట్ల రాష్ట్ర మంత్రి శ్రీ నారా లోకేష్ గారు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
కడప జిల్లా పర్యటనలో భాగంగా ప్రొద్దుటూరుకు విచ్చేసిన మంత్రి నారా లోకేష్ గారు, కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ చదివిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి గారు, యువ నాయకుడు శ్రీ పుత్తా లక్ష్మిరెడ్డి గారితో కలిసి ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా పుట్టా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన నాయకులు, శ్రీమతి పుట్టా పోలమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి తమ అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి శ్రీమతి సవితమ్మ గారు, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శ్రీ నంద్యాల వరదరాజుల రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్సీ శ్రీ బీటెక్ రవి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.


