ఖమ్మం జులై
(పున్నమి న్యూస్)
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర పిలుపు మేరకు ఖమ్మం నగర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కళాశాలల బంద్ విజయవంతమైంది. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలలను ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు బంద్ చేయించారు.
ఈ సందర్భంగా ఏబీవీపీ ఖమ్మం నగర సంయుక్త కార్యదర్శి సాయి చైతన్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన సుమారు రూ.11 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తక్షణమే పెండింగ్ బకాయిలను చెల్లించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



