Sunday, 12 July 2026
  • Home  
  • ఓటర్ల పరిశీలనలో బీజేపీ కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలి- కోలా ఆనంద్
- తిరుపతి

ఓటర్ల పరిశీలనలో బీజేపీ కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలి- కోలా ఆనంద్

శ్రీ కాళహస్తి, జులై 11 : (పున్నమి టెంపుల్ న్యూస్): రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఓటర్ల ప్రత్యేక పరిశీలన కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చురుకైన పాత్ర పోషించాలని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన బీజేపీ జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పార్టీ కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ.. బూత్ లెవల్ ఆఫీసర్ల (బీఎల్ఓలు)తో సమన్వయంగా పనిచేస్తూ క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఓటరు జాబితాలో ఉండేలా, అనర్హుల పేర్లు తొలగించేలా తప్పులు లేని పారదర్శక ఓటర్ల జాబితా తయారీకి కార్యకర్తలు కృషి చేయాలన్నారు. పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు ప్రజల్లో పార్టీ ప్రభావాన్ని మరింత విస్తరించేందుకు ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా మాజీ అధ్యక్షుడు చంద్రప్ప, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కండ్రిగ ఉమా, జిల్లా ఉపాధ్యక్షుడు మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీడీ బాలాజీ, అధికార ప్రతినిధి కొండేటి గోపాల్, కిసాన్ మోర్చా నాయకులు కుప్ప ప్రసాద్, కునాటి నాగరాజు, నాయకులు జీవీ అమర్‌నాథ్, ప్రజ్ఞశ్రీ, భరత్ కుమార్ నాయుడు, మండల అధ్యక్షులు పూజారి ప్రేమ్ కుమార్ రెడ్డి, వేడం కృష్ణయ్య, ఆర్. హరీష్ రెడ్డి, బాగిత్తి వెంకటేష్, తిరుమలశెట్టి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.