జయశంకర్ భూపాలపల్లి జూలై 11 పున్నమి న్యూస్ : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ గారు ఐడిఓసి డి ఎం అండ్ హెచ్ ఓ కార్యాలయం నందు ప్రపంచ జనాభా దినోత్సవ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ జూలై 11 నుంచి 18 వరకు జిల్లా వ్యాప్తంగా జనాభా నియంత్రణ ,మాత శిశు సంరక్షణ ,అంశాలపై అవగాహన సదస్సులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు . బిడ్డకు బిడ్డకు మధ్య కనీసం మూడు సంవత్సరములు ఎడం ఉండాలని, ప్రభుత్వం అందిస్తున్న కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించాలని దీనివలన తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని తెలియజేశారు బాల్య వివాహాలు ప్రోత్సహించరాదని ఆర్థిక అభివృద్ధి ,ఆరోగ్యం, విద్య సమానత్వం బాధ్యతయుతమైన జీవన విధానం చిన్న కుటుంబంతోనే సాధ్యమని తెలిపారు,ప్రతి సంవత్సరం జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం ఘనంగా నిర్వహిస్తారు, 2026 సంవత్సరానికి గాను దీని ప్రధాన థీమ్ యువత ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడం నేడు మరియు భవిష్యత్తు కోసం– తెలంగాణలో పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రవ్యాప్తంగా కుటుంబ నియంత్రణ ఆరోగ్య సంరక్షణ మరియు సుస్థిర అభివృద్ధిపై అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి విద్యాసంస్థలు, మరియు స్వచ్ఛంద సంస్థలు, జనాభా నియంత్రణ మరియు వనరుల సద్వినియోగం పై ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తున్నాయి .అదేవిధంగా డిఎం అండ్ హెచ్ ఓ మాట్లాడుతూ13-07-2026 నాడు నిర్వహించబోయే జాతీయ నులి పురుగుల నివారణ కార్యక్రమమును విజయవంతముగా నిర్వహించాలని సూచించారు
కుటుంబ నియంత్రణ కార్యక్రమంలో ఉత్తమ సేవలు అందించిన వారికి శాలువా మెమొంటోళ్ళతో సన్మానించారు బెస్ట్ ఫ్యామిలీ ప్లానింగ్ సర్జన్ డాక్టర్ దివ్య జి జి హెచ్, డాక్టర్ కేజీయ గైనకాలజిస్ట్, డాక్టర్ రోహిణి భూపాల్ పల్లి, శ్రీలత ఏఎన్ఎం మొగుళ్లపల్లి, రాజశ్రీ ఆశ పొట్లపల్లి విలేజ్ ,మధుమిత వైఫ్ ఆఫ్ సంతోష్ రాజీవ్ కాలనీ భూపాల్ పల్లి ఒక బిడ్డ కలిగి ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించు కున్నారు , ఈ కార్యక్రమంలో పి ఓ లు డాక్టర్ శ్రీదేవి సందీప్ డెమో కె శ్రీదేవి ఏ ఎం ఓ సుధాకర్, సూపర్వైజర్ లు ఏఎన్ఎంలు హెల్త్ అసిస్టెంట్లు ,ఆశాలు మొదలగు వారు పాల్గొన్నారు.



